నవతెలంగాణ – ఆర్మూర్
నిర్మల్ న్యాయవాది అయిన పుట్ట అనిల్ కుమార్ పై అకారణంగా ఆవేశంతో నిర్మల్ టౌన్ పోలీసు దాడి చేయడం పట్ల గురువారం పట్టణ కోర్టు విధులను బహిష్కరించినారు. తాను పోలీసులు అనే విషయాన్ని కూడా మరిచి ఎదుటి వ్యక్తి ఒక న్యాయవాది అనే విషయాన్ని కూడా తాను మరిచి కోర్టు ప్రాంగణంలోనే దాడి చేయడమే కాకుండా న్యాయవాది కారును సైతం బద్దలు కొట్టడం, కారులో ఉన్న సీట్లను సైతం చింపేయడం ఓ ఉన్మాదిగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించి దాడి చేసినటువంటి కానిస్టేబుల్ పై ఈ సంఘటనకు సంబంధించిన పై అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగారం న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదిపై దాడిపట్ల కోర్టు విధుల బహిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



