Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
17 శాతం తేమత, తాలు, తరుగు లేకుండా నాణ్యత ప్రమాణలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి , సెంటర్లో రైతులతో మాట్లాడుతూ.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు . రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఇబ్బంది లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యమును జాప్యం చేయొద్దని, వర్షం కూడా లేనందున తేమ ను పరిశీలించి రైతులకు మేలు జరిగే విధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పత్తి రైతులు 12 శాతం వరకు తేమ వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలని అప్పుడు పత్తి కొనుగోలు లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ , జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేష్ , సహకార అధికారి పత్య నాయక్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ నరేష్, సెక్రెటరీ సుఖేందర్, తదితరులు, ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -