Thursday, November 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అంబేద్కర్ భవనం వరకు రోడ్డు వేయాలి

అంబేద్కర్ భవనం వరకు రోడ్డు వేయాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్కు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. జన్నారంలోని రామాలయం నుంచి అంబేడ్కర్ భవన్కు కచ్చా రోడ్డు ఉంది. అయితే ఆ భవనం కుంట ప్రాంతంలో ఉండడంతో రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నీరు ప్రవహిస్తోంది. ఇటీవల కలెక్టర్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్డును నిర్మిస్తామని హామీని ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కూడా అంబేద్కర్ భవనానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చి ఉన్నారన్నారు. ఇప్పటికైనా  అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి అంబేడ్కర్ భవన్కు రోడ్డు నిర్మించాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -