నవతెలంగాణ హైదరాబాద్:ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సారించాలని టీజీఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇవాళ పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ఇందుకు సంబంధించిన 7,980 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించారని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్‍కు కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అదనపు ఆదాయంపై ఆర్టీసీ దృష్టి సారించాలి: మంత్రి పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



