Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్కి మిర్జాపూర్ రోడ్డుకు మహర్దశ

దుర్కి మిర్జాపూర్ రోడ్డుకు మహర్దశ

- Advertisement -

నవతెలంగాణ -నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి , మిర్జాపూర్ నుంచి బీర్కూర్ మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సహాయంతో 24 కోట్ల 72 లక్షల రూపాయల మంజూరు చేయడంపై మిర్జాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుర్కి మిర్జాపూర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షుడు మారుతి, సీనియర్ నేత పురం వెంకట్ రమణ మాట్లాడుతూ మిర్జాపూర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి పలు విన్నవించడంతో పోచారం ప్రత్యేక కృషి, సీఎం సహకారంతో రోడ్డు విస్తరణకు నిధుల మంజూరు అయినట్లు తెలిపారు. ఈ రోడ్డు తొలిసారిగా హ్యామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) విధానం ద్వారా ఆధునికీకరిస్తున్నారని అన్నారు.

రోడ్లను కొత్త విధానంలో బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో 181.4 కిమీ దూరం వరకు అన్ని హంగులు కల్పించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారని. మరి కొన్ని రోజుల్లో పనులకు టెండర్లు ఖరారు చేస్తారని అన్నారు.కొందరు పని కట్టుకొని పోచారం శ్రీనివాస్ రెడ్డి పై లేనిపోని ఆరోపణ చేస్తూ హంగామా చేస్తున్నారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి ప్రధాత అయిన పోచారంపై లేనిపోని ఆరోపణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగన్న, జంగిలి శ్రీనివాస్, నర్సాగౌడ్ సాయిరాం , శ్రీనివాస్, సాయిలు, నాగభూషన్, లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -