Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత 

రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత 

- Advertisement -

జిల్లా యస్పి శరత్ చంద్ర పవార్ 
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 

నల్లగొండ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది అనే నినాదంతో రోడ్డు ప్రమాదాల నివారణకై వినూత్న కార్యక్రమం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వినూత్న కార్యక్రమం కు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి 65, నార్కట్ పల్లి- అద్దంకి రాష్ట్ర రహదారిపై   వాహనాల వేగ నియంత్రణ చేయడం కోసం  ప్రమాదాల కు గురైన వాహనాలను చూపిస్తూ వినూత్న కార్యాక్రమం ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ మొదలు పెట్టిన కార్యక్రమాన్ని నేషనల్ హైవే 65, చిట్యాల మండలం వెలిమినేడు వద్ద “నీ వాహనం వేగంగా వెళ్తుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదం ద్వారా యాక్సిడెంట్ కి గురైన కారును చూపుతూ హోల్డంగ్ ఏర్పాటు చేసి గురువారం  వాహనచోదకులకు అవగాహన కల్పించి వినూత్న కార్యక్రమాన్ని  ప్రారంభించారు.. .

ఈ సందర్భంగా జిల్లా యస్పి  శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.వాహన చోదకులు  అతివేగం తో ప్రయాణించడం, సీట్ బెట్టు పెట్టుకోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం మద్యం తాగి వాహనాలు నడపటం లాంటి అనేక తప్పిదాల వల్ల నిత్యం అనేక ప్రమాదాలకు గురై ఎంతో మంది క్షతగాత్రులు, మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. వాహన చోదకులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఇలాంటి హోల్డింగులు చూడడం వల్లన వేగ పరిమితి మించకుండా, సీట్ బెల్ట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుండా ఉండుటకు అవగాహన కలిగి ఉంటారని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు.

వాహన దారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ రోడ్డుపైన ఉన్నటువంటి సూచికలను గమనిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరుగుటకు గల కారణాలు తెలుసుకొని వెంటనే తగు నియత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి, చిట్యాల సిఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ మధు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -