- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, అధిష్టానం గుర్తిస్తుందని సూచించినట్లు తెలిపారు.
- Advertisement -



