Thursday, November 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్న ఆదిలాబాద్ వాసి కొమ్ము చరణ్ తేజ్

స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్న ఆదిలాబాద్ వాసి కొమ్ము చరణ్ తేజ్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
జిల్లా కేంద్రానికి చెందిన కొమ్ము చరణ్ తేజ్ స్విమ్మింగ్ పోటీల్లో తన ప్రతిభ చాటుతూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన చరణ్ తేజ్ తాజాగా ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాడు. హైద్రాబాద్ లోని జియాన్  స్పోర్ట్స్ అకాడమీ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చరణ్ తేజ్ కాంస్య పతకం సాధించాడు. 400 మీటర్ల ఐ.ఎం విభాగంలో కాంస్యం సాధించి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపారు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన చరణ్ తేజ్ ను డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎస్.జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థ సారథి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి, ప్రముఖ స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ, ఉపాధ్యక్షుడు లాలా మున్నా, సుంకు చిన్న,  కోశాధికారి హరిచరణ్, బారే శ్రీధర్, రాష్ట్రపాల్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే స్విమ్మింగ్ లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా కీర్తిని ఇనుమడింపచేస్తున్న చరణ్ తేజ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -