– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏళ్ళు గా సాగుతున్న నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని సెంట్రల్ లైటింగ్, రహదారి విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి పుర ప్రజలను దుమ్ము ధూళి నుండి కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాధికారులు ను కోరారు. సీపీఐ(ఎం) మండల కమిటీ,గ్రామ శాఖా కార్యదర్శుల సమావేశం గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మేడిపల్లి వెంకటేశ్వరరావు అద్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ కారణంగా వాహనాలు రాకపోకలతో ఉత్పన్నం అయ్యే దుమ్ము ధూళి తో పట్టణ ప్రజలు శ్వాసకోస సంబంధ రోగాలకు గురి అవుతున్నారని,వాహనాలు టైర్ ల రాపిడి కి గురయ్యే చిప్స్ రాళ్ళ తాకిడికి గురై వ్యాపార సముదాయాల అద్దం, గాజు గుమ్మాలు పగుళ్ళు ఏర్పడుతున్నాయని, దీంతో నివాసులు భయబ్రాంతులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలను కాపాడాలని కోరారు.
ఇటీవల మొంథా తుఫాన్ కు గురై దెబ్బతిన్న ప్రతి,వేరుశనగ,వరి సాగు దారులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కమిటీ సభ్యులు బి. చిరంజీవి డిమాండ్ చేసారు. ప్రతీ నెలా 10 లోపు గ్రామ శాఖా సమావేశాలు నిర్వహించి,మాస్ లైన్ ను విజయవంతం చేయాలని మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యురాలు తగరం నిర్మల,మురళి, దుర్గారావు లు పాల్గొన్నారు.



