- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
క్రీడల సమాఖ్య 69వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల అండర్ 17 బాల బాలికల అథ్లెటిక్స్ మీట్ కు బొమ్మలరామారం మండలంలోని మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు కోనేటి గోపాల్ టోర్నమెంట్ పరిశీలకులుగా నియామకం అయ్యారని ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మలజ్యోతి తెలిజేశారు. రాష్ట్ర పరిశీలకులుగా నియమితులైన కోనేటి గోపాల్ ను గురువారం జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ ఎం ఈవో రోజారాణి ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రటరీ దశరథ రెడ్డి ఉపాధ్యాయ బృందం అభినందించారు.
- Advertisement -


