Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేదాక పోరాటం ఆగదు..

తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేదాక పోరాటం ఆగదు..

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..
నవతెలంగాణ – భువనగిరి

కేంద్రం వద్ద ఉన్న బీసీ బిల్లులు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేదాక బీసీల రిజర్వేషన్ ఉద్యమం ఆగేది లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అవసరమైతే ప్రతిపక్షాలను ఢిల్లీకి తీసుకెళ్తామన్నారు. చలో ఢిల్లీ నిర్వహించి బీసీలను ఢిల్లీకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేంతవరకు మన బీసీల పోరాటం ఆగొద్దని, దీక్షకు విచ్చేసిన బీసీ కుల సంఘాల నాయకులకు, వివిధ పార్టీల నుండి వచ్చిన బీసీ ప్రతినిధులకు ఆయన, ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమమలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు గొట్టిపాముల బాబురావు,జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఓవైసీ చిస్తీ, మాజీ ఎంపీపీ అధికం లక్ష్మీనారాయణ గౌడ్, బీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మాటూరి అశోక్, కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ, బిజెపి నాయకులు సుర్వి శ్రీనివాస్ గౌడ్ , బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి వెంకటేష్ గౌడ్, హరినాథ్ ,మల్లేష్ కుకుదువు కృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, జూకంటి రవి, సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సబన్ కారు వెంకటేష్ , యాదగిరిగుట మండల అధ్యక్షుడు అశోక చారి,దళిత సంఘాల రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాదిగ, దేవేందర్ మాదిగ,శెట్టి బాలయ్య యాదవ్, అబ్బ గాని వెంకటేష్, పిట్టల బాలరాజ్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి ధర్పల్లి ప్రవీణ్ కుమార్, గుమడిలి రమేష్, శివకుమార్ రజక,  గౌలికార్ కిషన్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వేముల సత్యనారాయణ, దామోదర్, మేర సంఘం నాయకులు కీర్తి సత్యనారాయణ దొనకొండ సత్యనారాయణ, తదితర బీసీ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -