Friday, November 14, 2025
E-PAPER
Homeమానవిబాలికలకు భరోసా...

బాలికలకు భరోసా…

- Advertisement -

అక్షరాస్యత, ఉపాధి, ఆరోగ్య సంరక్షణలో కొంత పురోగతి సాధిస్తున్నప్పటికీ దేశంలో లక్షలాది మంది బాలికలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. పేదరికంలో మగ్గిపోతూ పితృస్వామ్య సమాజంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ బాల్య వివాహాలకు గురవుతున్నారు. రక్షణరహిత వాతావరణంలో బతుకుతున్నారు. నాణ్యమైన వైద్యానికి దూరంగా ఉంటున్నారు. చాలామంది మధ్యలోనే పాఠశాల మానేస్తున్నారు. అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇలాంటి సవాళ్లను పరిష్కరించడానికి అనేక సామాజిక సంస్థలు కృషి చేస్తున్నాయి. విద్యను కొనసాగించడంలో, జీవిత నైపుణ్యాలను బోధించడంలో, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందడంలో చేయూతనిస్తున్నాయి. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా అలాంటి ఐదు సంస్థల గురించి తెలుసుకుందాం.

ఎడ్యుకేట్‌ గర్ల్స్‌
2007లో సామాజిక వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్‌ ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ను స్థాపించారు. ఇది విద్యలో లింగ వివక్షను తగ్గించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోని గ్రామాలలో, విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో ఇది పనిచేస్తుంది. బడి బయట ఉన్న బాలికలను గుర్తించడానికి, వారిని బడిలో చేర్చడానికి కొన్ని సంఘాలను సమీకరిస్తుంది. అదే విధంగా పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందిస్తుంది. తన ప్రయత్నంలో ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటుంది. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రభుత్వ సదుపాయాలను ఉపయోగించుకొని ఒక శక్తి వంతమైన ఉద్యమాన్ని నిర్మించింది.

ఇది 55,000పైగా కమ్యూనిటీ వాలంటీర్లతో పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇరవై లక్షలకు పైగా బాలికలను తిరిగి విద్య వైపుకు తీసుకువస్తుంది. 2021లో ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ తన ప్రగతిని ప్రారంభించింది. అధికారిక విద్యను కోల్పోయిన 15 నుండి 30 ఏండ్ల వయసు గల బాలికలు, యువతుల కోసం ‘రెండవ అవకాశం’ అనే కార్యక్రమం రూపొందించింది. ప్రభుత్వ ఓపెన్‌ స్కూల్‌ను ఉపయోగించుకొని వయసు మీరిన వారికి, వివాహితులకు, విద్యాపరంగా వెనుకబడిన వారికి మాధ్యమిక విద్యకు అందిస్తుంది. రాబోయే దశాబ్దంలో కోటి మంది బాలికల జీవితాలను ప్రభావితం చేయాలని, వారి సాధికారత కోసం కొత్త అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎడ్యుకేట్‌ గర్ల్స్‌, ప్రపంచంలోనే మొట్టమొదటి డెవలప్‌మెంట్‌ ఇంపాక్ట్‌ బాండ్‌ని కూడా ప్రవేశపెట్టింది.

ప్రోత్సహాన్‌ ఇండియా ఫౌండేషన్‌
సోనాల్‌ కపూర్‌ స్థాపించిన ప్రోత్సహాన్‌ ఇండియా ఫౌండేషన్‌ అత్యంత దుర్బలత్వ పరిస్థితుల్లో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు సమగ్రమైన మద్దతును పొందేలా చూసే సంస్థ. కళలు, బాలికల హక్కుల గురించి కూడా ఇది పని చేస్తుంది. పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలతో పాటు ఎప్పుడూ పాఠశాలకు వెళ్లని, విద్యకు దూరమైన పిల్లలను చదివించే కృషి చేస్తుంది. ప్రోత్సహాన్‌ ముఖ్య ఉద్దేశం పిల్లల మెదుడు చురుగ్గా పని చేసేలా చూడడం, వారిలో అభ్యాస సామర్థ్యం పెంచడం. ఈ సంస్థ పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌ నగర్‌, ఉత్తమ్‌ నగర్‌, హస్తల్‌, దీపక్‌ విహార్‌, కాలనీ ద్వారకలో ఉన్న ఐదు ట్రామా-సమాచార బాలిక సాధికారత కేంద్రాలను నిర్వహిస్తుంది.

ఇవి బాలికలకు కౌన్సెలింగ్‌, సృజనాత్మక కళలు, ఆరోగ్య సంరక్షణ, విద్యా మద్దతును అందిస్తాయి. దేశమంతటా బాలల రక్షణా వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవస్థాగత మార్పును అంచనా వేయడం లక్ష్యంగా ప్రోత్సహాన్‌ వివిధ సంఘాలతో కలిసి పని చేస్తుంది. గత కొన్నేండ్లుగా ప్రోత్సహాన్‌ ఉపాధ్యాయులు, న్యాయ అధికారులు, సామాజిక కార్యకర్తలతో సహా 40,000 మందికి పైగా వ్యక్తులకు పిల్లల హక్కులు, లింగ సున్నితత్వంపై శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌, గౌహతి హైకోర్టులు న్యాయ శిక్షణ కోసం దీని ప్రయత్నాలను ప్రస్తావించాయి.

WeBhor (We Rise Together)
ఈ సంస్థ 2018లో రేష్మా ఆర్య స్థాపించారు. అణగారిన, తక్కువ ఆదాయ వర్గాల నుండి కౌమారదశలో ఉన్న బాలికలకు ఋతుస్రావం, లైంగిక ఆరోగ్యం, హక్కుల గురించి అవగాహన కల్పించడానికి సంగీతాన్ని ఉపయోగిస్తుంది. యువతులు చర్చించడానికి, విషయాల పట్ల మరింత అవగాహన కల్పించేందుకు పాటలు, నృత్యరూపకాలు వంటి సృజనాత్మక పద్ధతులను అవలభిస్తుంది. రేష్మా తరగతి గదిలో పిల్లలకు ఋతు చక్రం గురించి వివరిస్తూ ఒక హిందీ పాటను పాడింది. ఈ పాటలో అండాశయానికి ‘రాణి’ (రాణి), గర్భాశయానికి ‘మహల్‌’ (రాజభవనం) వంటి పేర్లను పెట్టి రూపకాలు రూపొందించింది. దీనికోసం యానిమేటెడ్‌ వీడియో కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సంస్థ సుమారు 20,000 మంది బాలికలతో కలిసి పనిచేసింది. అయితే వీరికి ప్రజల మూస మనస్తత్వాన్ని విచ్ఛిన్నం చేయడం అతిపెద్ద సవాలుగా మారింది.

మిలాన్‌ ఫౌండేషన్‌
2007లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులైన ధీరేంద్ర ప్రతాప్‌ సింగ్‌, శరదిందు గోస్వామి, ఇరెంగ్‌బామ్‌ దేబాషిష్‌ సింగ్‌ అన్నీ గుప్తా స్థాపించిన ఈ మిలాన్‌ ఫౌండేషన్‌ బాలికల విద్య, నాయకత్వ శిక్షణ, సమాజంపై అవగాహన అందిస్తుంది. దీని ద్వారా గ్రామీణ భారతదేశంలోని యువతులకు సాధికారత కల్పించడానికి అంకితమై పని చేస్తుంది. మిలాన్‌ ప్రధాన లక్ష్యం గర్ల్‌ ఐకాన్‌ పేరుతో అమ్మాయిలను బాల్య వివాహాలు, లింగ అసమానత, ఆరోగ్య విద్య వంటి సమస్యలను పరిష్కరించే అట్టడుగు నాయకులుగా గుర్తించి వారిని తీర్చిదిద్దుతుంది. దీనికోసం వీడియో సమర్పణలు, సమూహ చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలతో సహా సమగ్రమైన మూడు-దశల ఎంపిక ప్రక్రియను ఉపయోగిస్తుంది.

దీని ద్వారా సరైన నాయకులను గుర్తించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో ఎంపికైన బాలికలు కనీసం 100 మంది కమ్యూనిటీ సభ్యులను చేర్చుకునే లక్ష్యంతో పని చేస్తారు. తద్వారా అట్టడుగు స్థాయి మార్పును ప్రోత్సహిస్తారు. ఉదాహరణకు, ఒక గర్ల్‌ ఐకాన్‌ తన గ్రామానికి స్కూల్‌ బస్సు ప్రవేశపెట్టడానికి స్థానిక అధికారులతో చర్చలు జరిపి విజయం సాధించింది. ఇది పాఠశాల హాజరును గణనీయంగా పెంచింది. మిలాన్‌ ప్రయత్నాల తర్వాత బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. వారు సేవలందిస్తున్న ప్రాంతాలలో బాలికలలో పాఠశాల నమోదు పెరిగింది. రాబోయే ఐదేండ్లలో లక్ష మంది బాలికలను చేరుకోవడానికి ఫౌండేషన్‌ తన కార్యక్రమాలను విస్తరించాలని యోచిస్తోంది.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -