స్వాగతం పలికిన వ్యవసాయ శాఖ అధికారులు
వతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యానవన పంటల సాగు, లాభాలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ రైతు కమిషన్ బృందం గురువారం కేరళకు వెళ్లింది. బృంద సభ్యులకు కేరళ వ్యవసాయ శాఖ అధికారులు స్వాగతం పలికారు. ఈ బృందంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్, భవానీరెడ్డి, మెంబర్ సెక్రెటరీ గోపాల్, వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులున్నారు. కేరళలోని పళక్కాడ్ జిల్లాలోని ఎలేవంచేర్రి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయల తోటలను కేరళ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బృంద సభ్యులు పరిశీలించనున్నారు. కొన్నేండ్లుగా కూరగాయల సాగుతో కేరళ రైతులు ఆర్ధికంగా లాభపడుతున్నారు. కూరగాయల తోటలతో సాధిస్తున్న విజయాలపై అక్కడి రైతులను అడిగి తెలుసుకుంటారు 15న రైతు కమిషన్ బృందం తిరిగి తెలంగాణకు రానున్నది.
కేరళకు రైతు కమిషన్ బృందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



