Friday, November 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి చిక్కిన ఆదిభట్ల టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

ఏసీబీకి చిక్కిన ఆదిభట్ల టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

- Advertisement -

నవతెలంగాణ-ఆదిభట్ల
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఏసీబీ అధికారులు చిక్కాడు. బిల్డర్‌ నుంచి రూ.75వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపల్‌ పరిధిలోని టీసీఎస్‌ సమీపంలో నాలుగు వందల గజాలు గల ఇంటి స్థలం స్టిల్ట్‌ ప్లస్‌ నాలుగు అంతస్తుల రెసిడెన్సియల్‌ నిర్మాణ పర్మిషన్‌ కోసం స్థానిక బిల్డర్‌ నుంచి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వరప్రసాద్‌ రూ.1.50లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. దాంతో బిల్డర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి అసిస్టెంట్‌ వంశీకి బిల్డర్‌ రూ.75వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం మొబైల్‌ లోకేషన్‌ ఆధారంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వరప్రసాద్‌ను జిల్లెల్లగూడలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా లంచం డిమాండ్‌ చేసినట్టు ఒప్పుకున్నాడు. దాంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అలాగే ఆదిభట్ల మున్సిపల్‌ కార్యాలయంలో సాయంత్రం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇన్‌స్పెక్టర్స్‌ గౌస్‌ ఆజాద్‌, జగన్‌మోహన్‌రెడ్డి, మసియుద్దీన్‌, మధు సూధన్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -