Friday, November 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసిలికాన్‌ వ్యాలీలో చైనా ఏఐ జోరు

సిలికాన్‌ వ్యాలీలో చైనా ఏఐ జోరు

- Advertisement -

చైనీస్‌ డెవలపర్ల చౌక ఉత్పత్తులు
టెక్‌ దిగ్గజాలకు ముచ్చెమటలు

వాషింగ్టన్‌ : అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో చైనా కృత్రిమ మేధా (ఏఐ) ఉత్పత్తులు దూసుకుపోతున్నాయి. అమెరికన్‌ కంపెనీల ఆపరేషన్లలో అవి అనివార్యంగా భాగమయ్యాయి. చైనీస్‌ డెవలపర్లు అలీబాబా, జడ్‌.ఏఐ, మూన్‌షాట్‌, మినీమాక్స్‌ సంస్థలు అమెరికన్‌ కంపెనీల కంటే చాలా తక్కువ ధరలకు ‘ఓపెన్‌’ భాషా మోడల్స్‌ను అందిస్తున్నాయి. దీంతో యూఎస్‌ కంపెనీల కంటే చైనా ఏఐ కంపెనీలు దూసుకుపోతున్నట్టు రిపోర్టులు వస్తోన్నాయి చైనా టెక్‌ రంగాన్ని అడ్డుకోవాలన్న యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. చైనీస్‌ డెవలపర్ల చౌక ఉత్పత్తులు సిలికాన్‌ వ్యాలీ టెక్‌ దిగ్గజాలకు చెమటలు పట్టిస్తున్నాయి. షార్ట్‌ టర్మ్‌ రెంటల్‌ ప్లాట్‌ఫాం ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీకి బదులుగా అలీబాబాకు చెందిన క్యూవెన్‌ను ఎంచుకున్నామని ఎయిర్‌బీఎన్‌బీ సీఈఓ బ్రియాన్‌ చెస్కీ ఇటీవల పేర్కొన్నారు. క్యూవెన్‌ వేగవంతమైందని, చౌవకైందని ఆయన చైనీస్‌ మోడల్‌ను ప్రశించారు.

తమ కంపెనీ చాలా పనులను మూన్‌షాట్‌కు చెందిన కిమి కె2కు మార్చుకున్నామని సోషల్‌ క్యాపిటల్‌ సీఈఓ చమత్‌ పాలిహపితియా పేర్కొన్నారు. ఓపెన్‌ఎఐ, ఆంథ్రోపిక్‌ మోడల్స్‌తో పోలిస్తే చైనాకు చెందిన కిమి కె2 చాలా ఉత్తమ ప్రదర్శన కనబర్చుతుందన్నారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమేనని యుఎస్‌లో ఓపెన్‌ మోడల్స్‌ను ప్రోత్సహించే అటామ్‌ ప్రాజెక్ట్‌ స్థాపకుడు, మెషిన్‌ లెర్నింగ్‌ రీసెర్చర్‌ నాథన్‌ లాంబర్ట్‌ పేర్కొన్నారు. చైనీస్‌ ఓపెన్‌ మోడల్స్‌ అమెరికాలోని స్టార్టప్‌లలో డి ఫాక్టో ప్రమాణంగా మారాయన్నారు. చాలా యూఎస్‌ కంపెనీలు చైనీస్‌ టెక్నాలజీ ఉపయోగాన్ని బహిరంగంగా వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. వివిధ ఏఐ మోడల్స్‌ ఉపయోగాన్ని కచ్చితంగా కొలవడం సాధ్యం కాకపోయినా.. ఇండిస్టీ డేటా చైనీస్‌ సాంకేతికతల పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -