Friday, November 14, 2025
E-PAPER
Homeబీజినెస్టాటా మోటార్స్‌కు రూ.867 కోట్ల నష్టాలు

టాటా మోటార్స్‌కు రూ.867 కోట్ల నష్టాలు

- Advertisement -

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ భారీ నష్టాలను చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.867 కోట్ల నికర నష్టాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.498 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇటీవల టాటా క్యాపిటల్‌ లిస్టింగ్‌కు వచ్చిన సమయంలో అందులో పెట్టుబడులు పెట్టగా.. ఆ సంస్థ షేర్లు ఒత్తిడి పెరగడంతో మార్కెట్‌లో టాటా మోటార్స్‌కు నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గడిచిన క్యూ2లో కంపెనీ రెవెన్యూ రూ.18,585 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.17,535 కోట్ల రెవెన్యూ ప్రకటించింది. ఏడాదికేడాదితో పోల్చితే కంపెనీ విక్రయాల్లో 12 శాతం పెరుగుదల నమోదు చేసిందని టాటా మోటార్స్‌ ఎండీ, సీఈఓ గిరీస్‌ వాఫ్‌ు పేర్కొన్నారు. పండగ సీజన్‌లో జీఎస్టీ శ్లాబుల తగ్గింపునతో అన్ని సెగ్మెంట్లలో డిమాండ్‌ పెరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -