- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నైతిక విజయం తనదే అని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు. ఓ మహిళపై ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం దౌర్జన్యం చేసి గెలిచిందన్నారు. నియోజకవర్గంలో షేక్ పేట, యూసప్ గూడ సహా చాలా చోట్ల BRS కార్యకర్తలపై దాడులు చేసి, ఓటర్లను భయపెట్టి పోలింగ్‌ను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఇది నవీన్ యాదవ్ సొంత గెలుపు కాదని, రిగ్గింగ్, రౌడీలతో వచ్చిన విజయం అని సునీత మండిపడ్డారు.
- Advertisement -



