నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఏకంగా 200 స్థానాలు ఎన్డీయే కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి 37 స్థానాలను దక్కించుకుంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు.
ఎన్డేయే కూటమి ప్రధాన పార్టీలైన బీజేపీ 91, జేడీయూ 78, ఎల్‌జేపీ 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ప్రత్యర్థి కూటమి మహగఠ్‌బంధన్ ఓటమి చెందింది. మొత్తం 41 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 04 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ 28, సీపీఐ ఎంఎల్ (ఎల్) 04, సీపీఐ(ఎం) 01 స్థానాలు గెలిచాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పాచిక పారలేదు. ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు.
మొత్తం 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దఫా పోలింగ్ 6న నిర్వహించగా.. రెండో విడత పోలింగ్ 11న జరిగింది. ఈరెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో అధికశాతం పోలింగ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో బీహార్ పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ ప్రక్రియలో అధిక శాతం ఓటర్లు పాల్గొన్నారు.



