నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న మండల పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు నోట్ బుక్స్, పెన్సిల్, స్లేట్స్ (పలకలు) విద్యార్థినీ విద్యార్థులకు వెటర్నరీ డాక్టర్ నాగరాజ్ అందించారు. డాక్టర్ నాగరాజ్. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. చాచా నెహ్రు పుట్టినరోజు సందర్భంగా చిన్నారులతో కలిసి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం. చాలా సంతోషకరంగా ఉందని, భవిష్యత్తులో మీరు కూడా ఉన్నత స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ స్థాయిలో రాణించాలి అని, దేశవ్యాప్తంగా నవంబర్ 14 అంటేనే ఇది బాలల దినోత్సవం అంటే ఆటపాటలతో ఆహ్లాదకరంగా జరుపుకునే గొప్ప పండగని, విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంగా చదివితేనే గుర్తింపు వస్తుందని అన్నారు. మరొకసారి చిన్నారులకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం చందన. శివ. జె ఎస్ ప్రసాద్,పాల్గొన్నారు.
విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్సిల్స్, స్లేట్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



