నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని కొత్తగూడెం అంగన్వాడీ కేంద్రం లోశుక్రవారం బేటీ బచావొ, భేటీ పాడావో కార్యక్రమంపై సూపర్ వైజార్ శశికళ అవగాహన కల్పించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, మహిళలపై హింస, లింగ వివక్షపై గ్రామం లోని అంగన్వాడీ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. భేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మి,అంగన్వాడీ టీచర్ మంగమ్మ,ఆయా అరుణ,లబ్ధిదారులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అంగన్వాడీలో బేటీ బచవో, భేటీ పాడావో పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



