Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు పట్ల సంబరాలు 

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు పట్ల సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు 
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పట్ల పెబ్బేరు పురపాలక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. శుక్రవారం స్థానిక సుభాష్ చౌరస్తాలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం పై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని ఉపఎన్నిక రుజువు చేసిందన్నారు. నవీన్ యాదవ్ 25 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం తో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది అన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు రాష్ట్రంలో తిరుగులేదు అన్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -