Friday, November 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో కాంగ్రెస్ సంబరాలు..

ముధోల్ లో కాంగ్రెస్ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బస్టాండ్ చౌరస్తాలో టపాకాయలు పేలిచారు. ఆనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ లో భారీ మెజారిటీతో గెలిపించాయని  ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే తెలంగాణ మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేంనాధ్ రేడ్డి, కిషన్ పతంగి, కిషన్ పటేల్,రావుల శ్రీనివాస్,దిగంబర్,అజిజ్, నగేష్, నజీమ్,సందూరు యాదవ్ , ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -