Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫెడరేషన్ కప్ టోర్నీకి ఒకే కుటుంబం విద్యార్థులు ఎంపిక

ఫెడరేషన్ కప్ టోర్నీకి ఒకే కుటుంబం విద్యార్థులు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ తలకొండపల్లి
కల్వకుర్తి లో జరిగే ఫెడరేషన్ కప్ టోర్నీకి వెల్జాల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పరమేశ్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు 13.11.2025 నుండి 15.11.2025 వరకు కల్వకుర్తి లో జరిగే 9వ సీనియర్ అత్య పత్య ఫెడరేషన్ కప్ టోర్నీకి వెల్జాల్ పాఠశాల విద్యార్థులు కె. చందు, 9వ, కె. స్పందన పూర్వ విద్యార్థు లు ఎంపిక కావడంతో అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. వీరు ఇద్దరు ఒకే కుటుంబం నుండి అక్క తమ్ములు కావడం ఇంకా ఆనందం గా ఉంది. ఎంపికైన క్రీడాకారులు ఛాంపియన్ షిప్ లో మంచి ప్రతిభ కనపరచాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  నసీం సుల్తానా,  ఉపాధ్యాయ బృందం  అభినందించారు. గ్రామ పెద్దలు క్రీడాభిమానులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -