Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేద్దాం 

బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేద్దాం 

- Advertisement -

– బిబిపేట మత్స్యకారుల సంఘం నాయకులు
నవతెలంగాణ –  కామారెడ్డి

శనివారం కామారెడ్డి జిల్లాలో సత్య కన్వెన్షన్ హాల్ జరగబోయే బీసీ ఆక్రోష సభకు పెద్ద ఎత్తున తరలి ఆ సభను విజయవంతం చేస్తామని మత్స్యకారుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం బిబిపేట మండల కేంద్రంలో వారు సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. బీసీల 42 శాతం రిజర్వేషన్లు సాధించే క్రమంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఆక్రోశ సభను విజయవంతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మచ్చ శాఖ జిల్లా అధ్యక్షులు గాజం సత్యనారాయణ, మండల అధ్యక్షులు పంపరి శివరాములు, సెక్రటరీ పరశురాములు, ఉపాధ్యక్షులు కనకరాజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల నాయకులు పసులాది లక్ష్మణ్, కొల్లూరి రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -