Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల్లో మార్పు కోసం పాదయాత్ర..

విద్యార్థుల్లో మార్పు కోసం పాదయాత్ర..

- Advertisement -

జానికిరాం చౌదరి 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఆరోగ్యానికి ఉపయోగపడే నడక, వ్యాయామం చేయాలని కోరారు. మత్తుపానియాలు, గంజాయి వంటి దూరాలవాట్లకు బానిసలుగా మారి వారి భవి జీవితాన్ని భవిష్యత్ కోల్పోతున్నారని విద్యార్థుల్లో మార్పు కోసం మిర్యాలగూడ అర్టీసీ బస్టాండ్ నుండి త్రిపురారం వరకు 12కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టి మార్పు తేవాలని కోరుకుంటున్నట్లు సీనియర్ రాజకీయ వేత్త జానికిరాం చౌదరి తెలిపారు. దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నందున అదేరోజు విద్యార్థుల్లో మార్పు రావాలని పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు బాలల అవసరం చాలా వున్నదని నేటి బాలలే రేపటి పౌరులని డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.యువత చదువుతోపాటు పోటి పరీక్షల్లో రాణించాలని సూచించారు విద్యార్థుల దృష్టి సామాజిక చైతన్యానికి దోహదపడాలని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.పాదయాత్ర కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ధనవత్ సైదానాయక్ బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్ ధనవత్ గగన్ నాయక్ మక్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -