Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంఈసీ స‌హ‌కారంతోనే ఎన్డేయే గెలుపు: దీపాంకర్‌ భట్టాచర్య

ఈసీ స‌హ‌కారంతోనే ఎన్డేయే గెలుపు: దీపాంకర్‌ భట్టాచర్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డిఎ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 185 మార్క్‌ని దాటింది. ఇక మహాగట్బంధన్‌ అనుకున్న స్థాయిలో ఫలితం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో బీహార్‌లో అనూహ్యంగా ఓటర్ల సంఖ్య పెరిగిందని… దీనికి ఎన్నికల సంఘం(ఈసీ) సహకరించడం వల్లే ఎన్‌డిఎ కూటమి గెలుస్తుందని సిపిఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచర్య ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) చేపట్టిన తర్వాత ఓటర్ల సంఖ్య కంటే.. ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య మూడు లక్షలు పెరిగింది. ఇదెలా సాధ్యమనిఆయన ఎన్నికల సంఘాని ప్రశ్నించారు.

బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తర్వాత 7.42 కోట్ల ఓటర్ల జాబితా ఉంది. అయితే ఎన్నికల తర్వాత ఈ సంఖ్య 7,45,26,858గా ఉందని ఎన్నికల సంఘం నవంబర్‌ 11న మీడియా సమావేశంలో పేర్కొంది. ఎస్‌ఐఆర్‌ జాబితాకు.. ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యలో తేడా ఉంది. ఎన్నికల్లో మూడు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? అని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -