Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆద్వర్యంలో నేడు గుపన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులకు జీవన శైలి,  నైపుణ్యత పై అవగాహన కల్పించారు. అలాగే చొక్కా గుండీలు ఉండిపోతే వేసుకొన్న చొక్కా పనికిరాకుండాపోదని తిరిగి ఉండిన చొక్కా గుండీ కుట్టుకోవడం ద్వారా తిరిగి దానిని వాడవచ్చని చొక్కా గుండి కుట్టుకునే విధానాన్ని నేర్పించారు మనం చేయి గల పనులను మనమే చేసే విధానాన్ని ఇప్పటినుండే నేర్చుకోవాలని తెలిపారు. జీవితంలో ఒడిదుడుకుల వచ్చాయని భయపడితే మన లక్ష్యం అక్కడే ఆగిపోతుందని ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించుకుంటు వేళితే విజయం సాధించవచ్చాని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ శకుంతల లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సర్విస్ హకో- ఆర్డినేటర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్ డైరేక్టర్ సుజాత రెడ్డి, పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -