Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోంది : సీఎం రేవంత్

హైదరాబాద్‌ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోంది : సీఎం రేవంత్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ భారీ మెజార్టీ విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో విజయం అందించిన ప్రజలకు ఈ సందర్బంగా సీఎం ధన్యవాదాలు తెలిపారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -