గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ సందర్బంగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారని అన్నారు. దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. ఈరోజు కైనా ప్రజలు న్యాయం వైపు ఉన్నారన్నారు. నవీన్ యాదవ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఉర్దొండ వనిత రవి, జూలూరు సుధాకర్, తాటి ప్రసాద్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, మామిళ్ళ రమేష్, గడ్డమీది మహేష్, సుగుణ, రంగా రమేష్, గడ్డం సురేందర్ రెడ్డి,నరసొల్ల మహేష్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



