మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ వినతి
నిధులు మంజూరు చేయించి కట్టను కాపాడాలి : మునిగలవీడు రైతులు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగలవీడు గ్రామంలోని నందన చెరువు కట్టకు బుంగలపడి నీళ్లు వృధాగా పోతుందని వెంటనే దానికి శాశ్వతంగా ఉండే నిర్మాణ పనులు చేపట్టాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు పత్రాన్ని అందించినట్లు ఆ గ్రామ రైతులు బైసా లింగయ్య బైసా ఉప్పలయ్య ఎండి యాకూబ్ ఎండి సైదులు కే ఐలయ్య బి మధు యాదగిరి వీరమల్లు తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం వారు మాట్లాడుతూ .. గ్రామంలోని నందన చెరువు కట్టకు దొంగలు పడి నీ వృధాగా కిందకు వెళుతూ ఉందని దీంతో కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ మధ్యలో కురిసిన మెంతా తుఫాన్ రావడం వల్ల చెరువులో నీరు బాగా చేరి చెరువు కట్టకు బుంగలపడి చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం నెలకు ఉందని అన్నారు దీంతో గ్రామస్తులు కలిసి తాత్కాలికంగా గండ్లు జెసిబి సహాయంతో పూడ్చామని అన్నారు. చెరువు కట్టకు వెళ్ళడానికి సుమారు 500 మీటర్ల దూరం ఉందని ముంత తుఫాన్ రావడంతో వరదలు ఎక్కువ వచ్చి రోడ్డు మొత్తం ధ్వంసం అయిందని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేయించడానికి నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించామని తెలిపారు.
నందవరం చెరువు కట్టకు శాశ్వత నిర్మాణ పనులు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



