Friday, November 14, 2025
E-PAPER
Homeకరీంనగర్కలివి వనం సినిమా పోస్టర్ ఆవిష్కరణ..

కలివి వనం సినిమా పోస్టర్ ఆవిష్కరణ..

- Advertisement -

– సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను ఆదరించాలి..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ వేములవాడ: సామాజిక సందేశంతో రూపొందుతున్న కలివి వనం సినిమా పోస్టర్‌ను ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం వేములవాడలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర యూనిట్ సభ్యులు ప్రభుత్వ విప్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి సమాజానికి అవసరమైన సామాజిక అవగాహనను చేరవేసే సినిమాలు రూపొందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా చెట్ల ప్రాధాన్యతను ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమా రూపొందించడం ఎంతో గొప్ప విషయం అని ప్రశంసించారు. ఇటువంటి మంచి సందేశంతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.

సినిమా దర్శకుడు రాజ నరేంద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద సవాలు అయ్యిందని తెలిపారు. కుటుంబం కలిసి చూసే సినిమాలు తగ్గిపోయిన ఈ సమయంలో కలివి వనం మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే చిత్రంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతో కలిసి సినిమా వీక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మారం ప్రవీణ్ కుమార్ (పప్పీ ), రంగు వెంకటేష్ గౌడ్, డిజైనర్ జక్కని శేఖర్‌తో పాటు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -