Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలుస్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ వికలాంగుల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు

స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ వికలాంగుల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్

వికలాంగ విద్యార్థులైనప్పటికీ దేశ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అందంగా ముస్తాబై బాలల దినోత్సవం రోజు దేశం మీద ప్రేమ దేశ ఐక్యతను మరింత పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శన ద్వారా చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి అభినందించారు. ది వింగ్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ ద్వారా జవహర్ లాల్ కి పిల్లల మీద వున్న అమితమైన ప్రేమ ఆప్యాయతను తెలియజేశారని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో (బాలల దినోత్సవ) చిల్డ్రన్స్ డే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి హాజరయ్యారు.


ఈ సందర్భంగా విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల రూపాలలో వేషధారణతో విభిన్న పలు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ముందుగా బాలల దినోత్సవం వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు.నెహ్రూ దేశ ఐక్యత , స్వాతంత్ర్యం కోసం మరియు పిల్లలంటే ఎందుకు అంత మక్కువ అన్న విషయాలను క్లుప్తంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.. జైల్లో ఉన్నప్పటికీ గాను తన కూతురు మీద ఉన్న ప్రేమానురాగాలతో, చిన్నారులపై ఉన్న ప్రేమతో పక్షులు పువ్వులు గాలి బుగ్గలు, పిల్లల మీద ఉన్న అమితమైన ప్రేమను దృష్టిలో ఉంచుకొని ది వింగ్స్ ఆఫ్ ఇండియా అనే బుక్కును రచించారని తెలియజేశారు.. అలాగే అన్నింటిలో కూడాను ఆడపిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ప్రతి విషయంలో ముందంజలో ఉండాలని ఆకాంక్ష ఆయనలో ఉందని తెలిపారు.. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని కొనియాడారు. ఎందుకంటే పూర్వకాలం నుండి ఇప్పటివరకు దేవత మూర్తులు అందరూ కూడాను అమ్మవారి రూపంలో వివిధ పేర్లతో కోలవడం మొక్కడం జరుగుతుందన్నారు.. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలని సూచించారు.

అలాగే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ శాఖలోని అన్ని విభాగాల్లో సైతం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల పట్ల గౌరవమివ్వడం అనే విషయాలపై ఎక్కువగా చెప్పడం జరుగుతుందన్నారు.. అలాగే బేటి బచావో బేటి పడావో అనే నినాదంతో ఆడపిల్లల అభ్యున్నతి కోసం ముందుకు వెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు..దివ్యాంగ విద్యార్థుల అయినప్పటికీ సకలాంగులకు దీటుగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల రూపాలలో ముస్తాబై పాశ్చాత్య పోకడాలకు పోకుండా సినిమా పాటలు లేకుండా కేవలం దేశానికి సంబంధించిన మరియు అన్నదాతలకు సంబంధించిన పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు.

పిల్లలు దైవంతో సమానమని వారు సంతోషంగా బాల్యాన్ని ఆస్వాదించాలని వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని సూచించారు… అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులు మాట్లాడుతూ బాల్యం అనేది పిల్లలకు చాలా ముఖ్యం.. పిల్లలు చిన్నతనంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా సంతోషంగా బాల్యాన్ని ఆస్వాదించే వయసు అని తెలిపారు… బాల్యంలో ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం చదువు ఆటపాటలతో గడిచిపోతుందని తెలిపారు.. ఎప్పుడైతే బాల్యం దాటి పెరిగి పెద్దది అవుతారో అప్పుడు బాధ్యతలు మీద పడినప్పుడు అదే మనము బాల్యాన్ని సంతోషంగా అనుభవించలేకపోయాము అని నిరాశ నిస్సృహలకు గురయ్యే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. అందుకే ఒక కుటుంబంలో విభిన్న రకాల మనుషులు విభిన్న వ్యక్తిత్వాలు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉండడం జరుగుతుంది.

అయినప్పటికీ ఎవరి ఆలోచన విధానం విధంగా వారు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారని తెలిపారు.. ఎలాంటి సమస్యతో ఉన్నప్పటికీ మనకు భగవంతుడు ఇచ్చిన ప్రకారం మనకు ఇది లేదు నా ఆరోగ్యం బాగోలేదు ఇలాంటివి అన్ని పక్కన పెట్టి కేవలం బాల్యాన్ని చదువుతూ ఆటపాటలతో సంతోషంగా బాల్యాన్ని ఆస్వాదించాలని సూచించారు.. ప్రత్యేకంగా పాఠశాల గురించి విద్యార్థినీ విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని కనబడడం లేదని వారు అన్నారు. వికలాంగ విద్యార్థుల ఉన్నతి కోసం ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ కార్యదర్శి

ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మరియు స్నేహ సొసైటీ సిబ్బందిని వారు అభినందించారు.. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు.. అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ మనోజ్ సాయి, గైనకాలజీ వైద్యులు డాక్టర్ ఇందు, దయానంద్, రమణారెడ్డి, జీవన్ రావు, సుధాకర్, ఆయా రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ పదిమంది పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని, విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సాంస్కృత ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -