Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించుకోవాలి 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించుకోవాలి 

- Advertisement -

బి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ 
నవతెలంగాణ-పాలకుర్తి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఎస్.పి అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని బిఎస్పి జిల్లా అధ్యక్షుడు మడిపడగ చంద్రశేఖర్ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షులు ఈదునూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనగామ జిల్లా ఇన్చార్జ్ పైసా శ్రీకాంత్ తో కలిసి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యమన్నారు. ప్రతి సంవత్సరం జరిగే జనకల్యాణ్ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. బహుజనులందరినీ కూడగట్టి బహుజన రాజ్య స్థాపన కోసం బీఎస్పీ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మబ్బు ఉదయ్,మండల అధ్యక్షుడు వేల్పుల కుమార్ స్వామి, ఈదునూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -