సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాయి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్ తో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేకనే బిఆర్ఎస్ పార్టీ దిగజారుడు విమర్శలకు పాల్పడుతుందని విమర్శించారు.
అర్హులైన పేదలందరికీ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుచున్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించడం పట్ల జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు నవీన్ యాదవ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అపార నమ్మకమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించాడని తెలిపారు. ఇదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పని చేస్తూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మాదాసు హరీష్, లావుడియా భాస్కర్ నాయక్, బండిపెళ్లి మనమ్మ, బైకానీ ఐలేష్, గాదెపాక భాస్కర్, జిల్లా, రాష్ట్ర నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, గుగ్గిళ్ళ ఆదినారాయణ, పాలకుర్తి పట్టణ అధ్యక్షులు కమ్మగాని నాగన్న గౌడ్, మాజీ ఎంపీపీలు కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, గడ్డం యాకసోమయ్య, జలగం కుమార్, పెనుగొండ రమేష్, నీరటి చంద్రయ్య, మార్కెట్ డైరెక్టర్ గోనె అశోక్ రెడ్డి, తొర్రూర్ సొసైటీ మాజీ చైర్మన్ కుసా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



