నవతెలంగాణ వెల్దండ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను , ప్రభుత్వం చేస్తున్న పాలనను చూసిన జూబ్లీహిల్స్ ఉన్నా ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించడం హర్షించదగ్గ విషయం అన్నారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోతిలాల్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, పర్వత రెడ్డి, రషీద్, హరికిషన్ నాయక్, ఎర్ర శ్రీను, శ్రీనివాస్ యాదవ్, శంకర్ నాయక్, పురుషోత్తం చారి, హమీద్ , వెంకట్ నాయక్, రామస్వామి యాదవ్, కృష్ణ, లాలునాయక్, పుల్లయ్య తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



