నవతెలంగాణ – మిడ్జిల్
మానవుని జీవితంలో అందమైనది, అద్భుతమైనది. మళ్లీ రానిది బాల్యం.. మర్చిపోలేనిదని బాల్య జీవితంమని కరస్పాండెంట్ జోసెఫ్ అన్నారు. బాలల దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సెంట్ మేరీ హై స్కూల్ ప్రిన్సిపాల్ జోసెఫ్ మాట్లాడుతూ.. చిన్నంతనంలో చేసిన జ్ఞాపకాలు తలుచుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు. విద్యార్థినిలు మాజీ ప్రధానమంత్రి నెహ్రూను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం గౌతమ్ అనే విద్యార్థి జన్మదిన వేడుకలు సందర్భంగా పాఠశాలలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి విద్యార్థుల పాటలు చూపర్లను ఎంతో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాల సిబ్బంది నెల్సన్, సీనా, రవికుమార్, లింగం, రాఘవేందర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసులు, సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అద్భుతమైన జీవితం బాల్యం: కరస్పాండెంట్ జోసెఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



