నవతెలంగాణ -పెద్దవంగర
జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా భాద్యతలు చేపట్టి, చక్కగా తోటి విద్యార్థులకు బోధించారు. అనంతరం చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులంటూ, విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. సమాజంలోని చెడుకు పిల్లలు దూరంగా ఉండాలని అందుకు తల్లిదండ్రుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులను చెడు మార్గం వైపు ఉసిగొల్పుతున్న మొబైల్ ఫోన్స్ కు దూరంగా విద్యార్థులు ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా బాలల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



