- Advertisement -
జిల్లా పంచాయతీ అధికారి కె.వెంకయ్య
నవతెలంగాణ – మర్రిగూడ
గ్రామాలలో అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కే.వెంకయ్య సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రత,వ్యాధుల నివారణ కోసం తప్పనిసరిగా శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు. పన్నులు వసూలు, డంపింగ్ యార్డ్ నిర్వహణ, తదితర అంశాలపై పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిసి మున్నయ్య, ఎంపీఓ రవికుమార్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
- Advertisement -



