Saturday, November 15, 2025
E-PAPER
Homeకరీంనగర్అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
జీజీహెచ్ సిరిసిల్లపై సమీక్ష సమావేశం
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రోజూ ఓపీ, అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వివిధ వార్డుల్లో రూఫ్ లీకేజీకి మరమ్మత్తు పనులు, పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఆధునీకరణ, పెయింటింగ్, ఏసీ, మరుగుదొడ్ల మరమ్మత్తు, మెష్ డోర్స్ ఏర్పాటు, మెటర్నిటీ వార్డులోని ఓపీ వద్ద పెయింటింగ్, మెష్ డోర్స్ ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ఇంకా ఔట్ పేషెంట్ మేల్ వార్డు మందులు తీసుకునే వద్ద షెడ్ ఏర్పాటు, అదనంగా నల్లా కనెక్షన్లు, ఆక్సిజన్ స్టోరేజ్ గదిలో పలు అభివృద్ధి పై సమీక్షించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న గైనకాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సభ్యత్వ నమోదు పెంచాలని, వైద్యులు, సిబ్బంది, ఆయా శాఖల అధికారులతో నమోదు చేయాలని సూచించారు.
సమీక్షలో జీ జీ హెచ్ సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ చికోటి సంతోష్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత, డీసీ హెచ్ ఎస్ డాక్టర్ పెంచలయ్య, వైద్యులు ఆవాస్ గౌరీ, ఎం లక్ష్మీనారాయణ, సుగుణ ప్రసాద్, ఐఎంఏ ప్రెసిడెంట్ శోభారాణి, ఆర్ ఎం ఓ డాక్టర్ కపిల్ సాయి, లయన్స్ క్లబ్ బాధ్యులు నాగుల సంతోష్, రెడ్ క్రాస్ బాధ్యులు వేణు, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -