Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅలరించే బీట్స్‌తో 'ప్రెట్టీ బేబీ..'

అలరించే బీట్స్‌తో ‘ప్రెట్టీ బేబీ..’

- Advertisement -

శర్వా తన అప్‌ కమింగ్‌ మూవీ ‘బైకర్‌’లో మోటార్‌సైకిల్‌ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ ఈ సినిమాని నిర్మించింది. ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ ల్యాప్‌ గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ‘ప్రెట్టీ బేబీ’ వీడియో సాంగ్‌ని రిలీజ్‌ చేసిన మేకర్స్‌ బైకర్‌ మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేశారు. జిబ్రాన్‌ ఈ పాటని అదిరిపోయే బీట్స్‌తో డ్యాన్సింగ్‌ నెంబర్‌గా కంపోజ్‌ చేశారు. జిబ్రాన్‌, యాజిన్‌ నిజార్‌, సుబ్లాషిని ఎనర్జిటిక్‌ వోకల్స్‌ తో ఆకట్టుకున్నారు. కృష్ణకాంత్‌ లిరిక్స్‌ చాలా క్యాచిగా ఉన్నాయి. ఈ సాంగ్‌లో శర్వా, మాళవిక నాయర్‌ కెమిస్ట్రీ అదిరిపోయింది. 1990, 2000 బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ‘బైకర్‌’ రేసింగ్‌ యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌, మల్టీ జనరేషనల్‌ ఫ్యామిలీ డ్రామా. డిసెంబర్‌ 6న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -