Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగొప్ప సందేశాన్నిచ్చే'మాస్టర్‌ సంకల్ప్‌'

గొప్ప సందేశాన్నిచ్చే’మాస్టర్‌ సంకల్ప్‌’

- Advertisement -

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, సంతోష్‌ ఫిలింస్‌ బ్యానర్స్‌ పై ‘ఆదిత్య, క్రియేటివ్‌ జీనియస్‌, విక్కీస్‌ డ్రీమ్‌, డాక్టర్‌ గౌతమ్‌, అభినవ్‌’ వంటి బాలల చిత్రాలను అందించిన డా. భీమగాని సుధాకర్‌ గౌడ్‌ తమ ప్రొడక్షన్‌లో ఆరవ చిత్రంగా ‘మాస్టర్‌ సంకల్ప్‌’ను మన ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. నటులు శివాజీ రాజా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ,’పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. బాలల కోసం నిస్వార్థంగా సినిమాలు రూపొందిస్తున్న డా. భీమగాని సుధాకర్‌ గౌడ్‌ అభినందనీయులు. ఈ చిత్ర ట్రైలర్‌ చాలా బాగుంది. పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా పోగొట్టాలి అనే అంశాన్ని ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా, మనసును కదిలించేలా సుధాకర్‌ గౌడ్‌ తెరక్కించారు’ అని అన్నారు. ‘ఇప్పటికే సుధాకర్‌గౌడ్‌ చేసిన చిల్డ్రన్‌ సినిమాలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యంలా ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ పొందాయి.

ఈ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి’ అని శ్రీ మిత్ర చౌదరి చెప్పారు. పెంచల్‌ రెడ్డి మాట్లాడుతూ,’ట్రైలర్‌ చాలా బాగుంది. యోగ, ధ్యానం వంటి మన ప్రాచీన సాధన మార్గాల ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా తొలగించవచ్చో ఈ చిత్రం ద్వారా సుధాకర్‌ గౌడ్‌ చక్కగా చూపించారు’ అని తెలిపారు. ‘ఈ రోజు పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. అనేక సర్వేల ద్వారా మనం విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. బాలల్లో పరీక్షలు, కుటుంబ వాతావరణం, మొబైల్‌ వాడకం, పెరిగిన సామాజిక నేపథ్యం ఇవన్నీ ఒత్తిడికి కారణాలుగా మారుతున్నాయి. పిల్లల్లో మానసిక రుగ్మతలు తొలగించేందుకు మన పూర్వీకులు చెప్పిన యోగ, ధ్యానం చక్కటి మార్గాలు. కానీ వాటిపై తల్లిదండ్రులకు అవగాహన లేదు. పిల్లలు యోగా, ధ్యానం చేసేలా పేరెంట్స్‌ ప్రోత్సహించాలి’ అని దర్శక నిర్మాత డా. భీమగాని సుధాకర్‌ గౌడ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -