అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, ‘ఇది మన తెలుగు నేలపై జరిగిన కథ.
ఈ సినిమా క్లైమాక్స్ చూసి నేను రెండు రోజులు నిద్రపోలేదు. సినిమా చూశాక మీకు కూడా అదే ఎమోషన్ కలుగుతుంది. అందరు అనుకుంటున్నట్లు ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు, అంతకంటే క్రూరమైన ఘటన ఈ జంట ఎదుర్కొంటారు. బయటకు రాకుండా చేసిన ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో మూవీని తీసుకొస్తున్నాం. మా గుండెల్లో నిలిచిపోయే సినిమా ఇది’ అని అన్నారు. చిత్ర సమర్పకులు డా.నాగేశ్వరరావు పూజారి, నిర్మాత రాహుల్ మోపిదేవి, డైరెక్టర్ వేణు ఊడుగుల, డైరెక్టర్ సాయిలు కంపాటి, ఈటీవీ విన్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ నితిన్, నిర్మాత వంశీ నందిపాటి, హీరో అడివి శేష్, హీరోయిన్ తేజస్వినీ , హీరో అఖిల్ ఉడ్డెమారి తదితరులు ఈ వేడుకలో పాల్గొని, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
అందమైన ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



