Saturday, November 15, 2025
E-PAPER
Homeసినిమా'సంతాన ప్రాప్తిరస్తు'కి సర్వత్రా ప్రశంసలు

‘సంతాన ప్రాప్తిరస్తు’కి సర్వత్రా ప్రశంసలు

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్‌ నుంచి ఈ సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్‌ రెడ్డి రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ సక్సెస్‌ అందుకున్న నేపథ్యంలో నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. ఒక ఎంటర్‌టైనింగ్‌ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా సినిమా సక్సెస్‌తో అర్థమైంది. క్రిటిక్స్‌ నుంచి రివ్యూస్‌ చాలా పాజిటివ్‌గా వచ్చాయి’ అని తెలిపారు.

డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ,’ఒక సోషల్‌ ఇష్యూ చుట్టూ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్‌ చేసి, ఎంగేజ్‌ చేసేలా సినిమా చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాను కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఎలాంటి అసభ్యత లేకుండా చూపించారంటూ అప్రిషియేట్‌ చేస్తున్నారు’ అని తెలిపారు. హీరో విక్రాంత్‌, హీరోయిన్‌ చాందినీ చౌదరి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజయ్ అరసాడ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, తమ విజయానందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -