తక్షణమే అమల్లోకి ఆర్టీఐ చట్ట సవరణ
న్యూఢిల్లీ : రెండేండ్ల తర్వాత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టంలో మెజారిటీ భాగాలను శుక్రవారం నోటిఫై చేశారు. 2017లో కె.ఎస్.పుట్టస్వామి వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా ఇదొక గణనీయమైన అడుగు. గోప్యతా హక్కును ధ్రువీకరిస్తూ, భారతీయుల డేటాను పరిరక్షించుకునేందుకు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చర్య ఇది. అలాగే జనవరిలో ముసాయిదా పంపిణీ చేసిన డిపిడిపి నిబంధనలు, 2025ను కూడా కేంద్రం నోటిఫై చేసింది. 2023 ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం ప్రకారం సంస్థలు భారతీయుల డిజిటల్ డేటాను పరిరక్షించాల్సి వుంటుంది. అలాగే ప్రభుత్వం, దాని సాధనాలకు మాత్రం మినహాయింపులు ఇవ్వాల్సి వుంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు శిక్షలను నిర్దేశిస్తోంది. అలాగే సమాచార హక్కు చట్టాన్ని కూడా ఈ చట్టం బలహీనపరుస్తోందని ఆర్బీఐ కార్యకర్తలు పేర్కొన్నారు ప్రభుత్వ అధికారి గోప్యతా హక్కు కన్నా ప్రజా ప్రయోజనాలే మిన్న అని పరిగణించాల్సిన పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందచేయాల్సిన బాధ్యతను ప్రభుత్వ సంస్థల నుంచి తొలగించారు. ఆ మేరకు సమాచార హక్కు చట్టాన్ని సవరించారు. ఈ సవరణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.
రెండేండ్ల తర్వాత అమల్లోకి డేటా చట్టం
- Advertisement -
- Advertisement -



