- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఖమ్మం రూరల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (40) శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చి తండ్రిని ఆ స్థితిలో చూసి భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. బాలాజీ మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -



