- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :గుజరాత్ హైకోర్టులో విచిత్రమైన విడాకుల కేసు వెలుగుచూసింది. భార్య (40) తరచూ వీధి శునకాలను ఇంటికి తీసుకువస్తోందని, తన మాట వినడం లేదని భర్త (41) కోర్టును ఆశ్రయించాడు. శునకం ఒకసారి తనను కరిచినా, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయాడు. భార్య కుర్తా ధరించడం, తనకు వివాహేతర సంబంధం ఉందంటూ రేడియోలో ప్రాంక్ చేయడంతో మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నాడు. భార్య మాత్రం ఆరోపణలను తోసిపుచ్చి రూ.2 కోట్ల భరణం కోరింది. వాదనలు విన్న హైకోర్టు విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది.
- Advertisement -



