- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి భారీ పేలుడు ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో భారీ మంటలు చెలరేగినట్లు ప్రత్యేక్ష సాక్షులు, సీసీ పుటేజీల ద్వారా తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



