నవతెలంగాణ-పెద్దవూర : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు మద్ధతు ధరను ప్రకటించిందని పత్తి రైతులు, కాపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సందీప్ కుమార్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు మద్ధతు ధరను ఎంఎస్పీ ప్రకటించింది. క్వింటాలుకు రూ.8,110గా ధరను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి పెద్ద ఎత్తున పత్తి వచ్చి చేరుతుందని తెలిపారు. జిల్లాలోని 28 మార్కెట్ యార్డుల పరిధిలో 30 కేంద్రాలను సీసీఐ ఏర్పాటు చేసిందని ఈ క్రమంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూడకుండా వెంటనే పత్తిని అమ్ముకొని వెళ్లేలా కొత్త విధానాన్ని సీసీఐ అమలులోకి తీసుకొచ్చిందని తెలిపారు.
పత్తి రైతులకు మేలు చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు రైతులు తమ స్మార్ట్ ఫోనులో కపాస్ కిసాన్ అనే యాప్ ను ప్లే స్టోరు నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరంఉంది అని తెలిపారు.ఒక వేళ స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్లలేకపోతే స్లాట్ రద్దు కూడా చేసుకోవచ్చు. ఒక వేళ ఎఈఓ దగ్గర పంటల నమోదు అయి కూడా స్లాట్ బుక్ కాకపోతే రైతుల మొబైల్ నంబర్ ని మీ ఏఈఓ దగ్గర ఈ నెల 16 వరకు పెద్దవూర రైతు వేదికలలో ఏ ఈఓలు అందుబాటులో ఉండి పత్తి పంటను అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేస్తారని అన్నారు. కావున మండలం లోని ప్రత్తి రైతులు ఈ రెండు రోజులు రైతు వేదిక ల దగ్గరికి వచ్చి స్లాట్ బుక్ చేసుకోగలరని కోరారు.



