Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని కలిసిన డిగ్రీ కళాశాలల యాజమాన్య

ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని కలిసిన డిగ్రీ కళాశాలల యాజమాన్య

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు.. క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా నియామకమైన బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపిన తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య అసోసియేషన్ సభ్యులు.. సుదర్శన్ రెడ్డి మొదటి నుండి విద్యా పట్ల, విద్యార్థుల పట్ల, కళాశాల యాజమాన్యాల పట్ల సానుకూల దృక్పథ్యతో ఉండి నిజామాబాద్ జిల్లాలో నాణ్యమైన విద్య ను ప్రోత్సహిస్తున్న వారికి క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ ముఖ్య సలహాలు పదవి రావడం సంతోషకరమని అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు. సుదర్శన్ రెడ్డి హయంలో నిజామాబాద్ లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పడిందని, వీరి హయంలో నిజామాబాద్ విద్య తారాస్థాయిలో అభివృద్ధి చెందడం ఖాయమని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, మారయ్య గౌడ్, శంకర్, సుజన్, గిరి, నవీన్, రమణ, హకీం, దత్తు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -