Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూములు కోల్పోయిన రైతుల త్యాగం వెలకట్టలేనిది 

భూములు కోల్పోయిన రైతుల త్యాగం వెలకట్టలేనిది 

- Advertisement -

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు శనివారం ఎమ్మెల్యే నష్ట పరిహారం  చెక్కులను అందించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారంగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే  అందించారు. నలుగురు రైతులు భూములు కోల్పోతే  రైతులకు రూ.15,14,667   నష్టపరిహారం ప్రభుత్వం తరఫున లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోయర్ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కృష్ణమ్మ వరదలతో ముంపుకు గురైన రేకులపల్లి గ్రామం సమీపంలోని జెన్కో దగ్గర 67 ఎకరాల వరకు రైతులు తమ భూములను కోల్పోయారు. దాదాపుగా 46 మంది రైతులు తమ భూములను త్యాగం చేసి జెన్కో లో విద్యుత్ ఉత్పత్తికి సహకరించినందుకే నేడు ప్రజలకు నాణ్య మైన కరెంటు సరఫరా  అయితుందన్నారు. రైతులు భూమిని ఎంతో పెద్ద మనసుతో ఆనాడు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. జెన్కో అధికారులతో పలుమార్లు కలిసి మాట్లాడి భూమిని కోల్పోయిన రైతులను ఆదుకోవాలని వారికి ఏదో రూపంలో ప్రభుత్వం వారికి నష్టపరిహారం అందించాలని కోరడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతుకు ప్రతి ఎకరానికి రూ.7 లక్షలు కేటాయించారు.

రూ.7లక్షలు కూడా తక్కువని ప్రస్తుత భూమి విలువ ధర రూ.30, 40 లక్షల విక్రయం అవుతుంది. మీ త్యాగం ఎన్నటికీ ఎప్పటికీ మరువలేనని కొనియాడారు. మూడో విడతలో భాగంలో రేకుల పల్లి గ్రామానికి చెందిన రైతులకు నలుగురికి  రూ.15,14,667  ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించారు. మీ త్యాగం వల్లనే నేడు విద్యుత్, సాగునీటి సరఫరా అవుతుందని కావున గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలని రైతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు,  , మాజీ కౌన్సిలర్ శ్రీను ముదిరాజ్, నాయకులు హనుమంతు రెడ్డి, గంట రమేష్ స్వామి, నాగేంద్ర యాదవ్, లక్ష్మన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -